మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

మహేష్‌ ‘సంభవామి’?

Updated:2016-12-15 18:38:52

Views:253

హేష్‌బాబు కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఎన్వీ ప్రసాద్‌, ఠాగూర్‌ మధు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘సంభవామి’ అనే పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆ టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించారు. మొదట ఈ సినిమాకి ‘ఏజెంట్‌ శివ’ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే చిత్రబృందం ‘సంభవామి’పేరుకే మొగ్గు చూపుతోందట. తమిళంలోనూ అదే పేరు ఖరారు చేస్తారని సమాచారం. ఇందులో మహేష్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌, పుణెల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.