మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

వెండితెర వీర ప్రేమగాథ

Updated:2016-12-28 12:23:41

Views:332

ఫిబ్రవరిలో వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ కూడా అచ్చమైన ప్రేమకథే. తన ప్రియురాలి కోసం కథానాయకుడు ఎన్ని సాహసాలు చేశాడన్నదే ఈ చిత్రకథ. కృష్ణగాడి పాత్రలో నాని భలే బాగా ఇమిడిపోయాడు. ఫలితంగా నానికి మరో విజయం దక్కింది. నాని నుంచి ఈ యేడాది విడుదలైన ‘జెంటిల్‌మన్‌’ ఓ థ్రిల్లర్‌ అయినా... అందులోనూ చక్కటి ప్రేమకథ(లు) మేళవించారు. ‘మజ్ను’ కూడా స్వచ్ఛమైన ప్రేమకథే. ఇద్దరమ్మాయిల మధ్య నలిగిన నవతరం మజ్నుగా నాని కనిపించాడు. ఆ చిత్రానికీ యువతరం నుంచి చక్కటి స్పందన వచ్చింది.