మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

అభినయ ‘ఆలియా’

Updated:2016-12-28 12:20:28

Views:56

యువతరంలో మంచి క్రేజ్‌ ఉన్న కథానాయిక ఆలియాభట్‌. బబ్లీ గర్ల్‌ పాత్రల్లో మెప్పిస్తూ వచ్చిన ఆలియాకు ఈ ఏడాది నటించిన ‘ఉడ్తా పంజాబ్‌’ సత్తా ఉన్న నటి అనే పేరు తీసుకొచ్చింది. ఏడాది మొదట్లో ‘కపూర్‌ అండ్‌ సన్‌ü్స’తో బాక్సాఫీసు విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. ఏడాది చివర్లో షారుఖ్‌ఖాన్‌తో కలిసి ‘డియర్‌ జిందగీ’లో విభిన్నమైన పాత్ర పోషించి విమర్శకుల మెప్పు పొందింది. ఇప్పటివరకూ ఆలియాకున్న ఇమేజ్‌ వేరు...ఈ ఏడాది పోషించిన పాత్రలతో వచ్చిన ఇమేజ్‌ వేరు. నటిగా బాలీవుడ్‌లో ఆలియాకు ఓ ప్రత్యేకస్థానం కట్టబెట్టింది 2016. ఈ ఏడాది ఆలియాభట్‌ కెరీర్‌ ఎన్ని మలుపులు తిరిగిందో చూడ్దాం.

‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ ఆలియా కెరీర్‌కు శుభారంభాన్నిచ్చింది. ఈ ఏడాది రూ.వందకోట్ల క్లబ్‌ చిత్రాల్లో చోటు దక్కించుకోవడమే కాదు విమర్శకుల నుంచీ మంచి ప్రశంసలు అందుకొంది. టియామాలిక్‌ పాత్రలో 80 మార్కులు వేయించుకొంది ఆలియా భట్‌. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ చిత్రం ఆలియాలోని హాస్య కోణాన్ని బయటపెట్టింది.