మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

రివ్యూ: ధృవ

Updated:2016-12-15 18:35:04

Views:140

మిళంలో విజయవంతమైన చిత్రాలు అనువాదాలుగా తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అయితే ‘తని ఒరువన్‌’ కథలో మాత్రం తాము నటించాల్సిందే అంటూ పలువురు కథానాయకులు ఆసక్తి చూపించారు. ఆ కథ మన పరిశ్రమని అంతగా ఆకర్షించింది. అందులో నటించే అవకాశం మాత్రం రామ్‌చరణ్‌కే లభించింది. తమిళంలో వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించిన ‘తని ఒరువన్‌’ రీమేక్‌లో రామ్‌చరణ్‌ నటించడం, అది కూడా ‘మగధీర’ తర్వాత గీతాఆర్ట్స్‌లో ఈ సినిమా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. దానికితోడు ప్రచార చిత్రాలూ ఆకట్టుకొనేలా ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఆ ఆసక్తికి తగ్గట్టుగానే సినిమా సాగుతుందో లేదో తెలుసుకొందాం పదండి.