మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

మెగా 150పై అనుభవాలతో బుక్

Updated:2016-12-22 17:42:30

Views:99

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ తో పాటు దర్శకుడు వివి వినాయక్.. మిగిలిన టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తెగ బిజీగా ఉన్నారు. మరోవైపు రామ్ చరణ్ ఖైదీ నంబర్ 150 ప్రచారానికి సంబంధించిన యాక్టివిటీస్ ను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు.ఇప్పటికే టీజర్.. అమ్మడు సాంగ్ సింగిల్ రిలీజ్ చేయడం ద్వారా ఈ మూవీ గురించి మెగాభిమానులతోపాటు ఇండస్ట్రీలో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. మరోవైపు ఖైదీ నంబర్ 150కు మరో ప్రత్యేకత కూడా ఆపాదించబోతున్నారు. అదే.. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన అనుభవాలతో పుస్తకం. ఖైదీ టీం ఈ పుస్తకం రిలీజ్ కు సబంధించిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సినిమా రిలీజ్ తో పాటే ఈ పుస్తకానికి సంబంధించిన రిలీజ్ ఫంక్షన్ కూడా విడుదల చేస్తారట. ఇందులో ఖైదీ నంబర్ 150కి వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్.. యాక్టర్స్ వారి అనుభవాలను వివరిస్తారని తెలుస్తోంది.