మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

వెండితెర యుద్ధానికి ‘దంగల్‌’ సిద్ధం!

Updated:2016-12-22 12:39:03

Views:666

మహావీర్‌ సింగ్‌ ఫోగట్‌ (ఆమీర్‌ఖాన్‌) మల్లయోధుడు. శోభా కౌర్‌ (సాక్షి తన్వర్‌)తో వివాహం అవుతుంది. మల్లయుద్ధంలో దేశానికి బంగారు పతకం అందించాలనేది ఆయన కల. కానీ అది నెరవేరదు. తనకు పుట్టబోయే కుమారుడి ద్వారా తన ఆశయం నెరవేర్చుకోవాలి అనుకుంటాడు. కానీ మహావీర్‌ దంపతులకు నలుగురు ఆడ సంతానం జన్మిస్తారు. ఆడపిల్లలు మల్ల యుద్ధంలో రాణించలేరు అనేది మహావీర్‌ అభిప్రాయం. అనుకోకుండా ఓ రోజు స్కూల్‌లో జరిగిన గొడవలో అతడి కూతుళ్లు గీత (ఫాతిమా), బబిత (సాన్యా మల్హోత్ర) ఇద్దరు అబ్బాయిల్ని ముక్కు పగిలేలా కొడతారు. దీంతో మహావీర్‌కు తన కూతుళ్ల శక్తిసామర్థ్యాలపై నమ్మకం కలుగుతుంది. మల్లయుద్ధంలో శిక్షణ ఇస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు ఎలాంటి విజయాలు సాధించారు. మహావీర్‌ తన కలను ఏవిధంగా సాకారం చేసుకున్నాడో తెరపైనే చూడాలి.