మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

లక్కుతోక తొక్కినోడు

Updated:2016-12-21 18:25:49

Views:352

మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లక్కున్నోడు’. హన్సిక కథానాయిక. రాజ్‌ కిరణ్‌ దర్శకుడు. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘లక్కీ అనే ఓ యువకుడి కథ ఇది. తాను అదృష్టవంతుడే. కానీ తన చుట్టూ దురదృష్టం ఉంటుంది. అందులోంచి పుట్టుకొచ్చే వినోదం నవ్విస్తుంది. విష్ణు నటన, పోరాట ఘట్టాలు, హన్సిక గ్లామర్‌ ప్రధాన ఆకర్షణ. టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే పాటలు కూడా విడుదల చేస్తామ’’న్నారు. పోసాని, వెన్నెల కిషోర్‌, ప్రభాస్‌ శీను తదితరులు నటించారు. సంగీతం: అచ్చు


తాజా వార్తలు