మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

రెమో తెలుగు ఆడియో రిలీజ్

Updated:2016-12-21 18:00:51

Views:43

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌కి ప్రత్యేక సందేశం పంపారట. హృతిక్‌, యామీ గౌతమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కాబిల్‌’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది. అయితే దీన్ని చూసిన రజనీ చిత్ర బృందాన్ని అభినందించినట్లు సమాచారం. డిసెంబరు 12న రజనీ పుట్టినరోజు సందర్భంగా ‘కాబిల్‌’ చిత్ర నిర్మాత రాకేశ్‌ రోషన్‌ సూపర్‌స్టార్‌కి ఫోన్‌ చేశారట. ‘నేను తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ‘కాబిల్‌’ ట్రైలర్లను చూశా, చాలా నచ్చింది. హృతిక్‌ నటన అద్భుతం అనిపించింది. ఈ సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తుంటానని హృతిక్‌కి చెప్పండి’ అని రజనీ ఫోన్లో అన్నట్లు బాలీవుడ్‌ సమాచారం. ‘కాబిల్‌’ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.