మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

రజనీ ‘బాషా’ ఈజ్‌ బ్యాక్‌

Updated:2016-12-16 15:44:00

Views:126

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే’ అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పలికిన డైలాగ్‌కు అప్పట్లో థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో బాషాగా రజనీ తన నట విశ్వరూపం చూపడంతో మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ థియేటర్లకు జనాలు పోటెత్తారు. అప్పటినుంచే మన సినిమాల్లో కథానాయకుడికి ఓ పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ను జోడించే సరికొత్త ఫార్ములా మొదలైంది. ‘తలైవా’ కెరీర్‌లోనే మోస్ట్‌ స్టైలిష్‌ ఫిల్మ్‌గా అభిమానులు భావించే ఈ సినిమా త్వరలో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి డిజిటలైజ్‌ చేసిన రీమాస్టర్డ్‌ ‘బాషా’ను త్వరలో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.