మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        టీఎన్ఆర్ఐ

లూసియానాలో మరో ప్రమాదం..

Updated:2016-12-23 13:00:14

views:296

అమెరికాలోని లూసియానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సరూర్‌నగర్‌కు చెందిన వినీత్‌రెడ్డి మృతి చెందాడు. మృతుని బంధువుల కథనం ప్రకారం.. సూర్యాపేట సమీపంలోని నామవరం గ్రామానికి చెందిన కీసర విజయపాల్‌రెడ్డి, చందన దంపతులు ఆరేళ్లుగా సరూర్‌నగర్‌లోని డాక్టర్స్‌ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమారుడు వినీత్‌రెడ్డి(25) ఉన్నత విద్య అభ్యసించడానికి 2012లో లూసియానా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 22వ తేదీ ఉదయం వినీత్‌, అతని స్నేహితుడు తరుణ్‌లు లఫాట్టే ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యలో ఓ కారు మరమ్మతుకు గురై ఉంది. ఆ కారు యజమానికి సాయం చేద్దామని ద్విచక్రవాహనాన్ని పక్కన నిలిపి వెళుతుండగా ఓ భారీ ట్రక్కు అకస్మాత్తుగా వీరిని ఢీకొట్టింది. వినీత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తరుణ్‌ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వినీత్‌ మృతదేహాన్ని ఆదివారం అర్ధరాత్రి సరూర్‌నగర్‌లోని ఇంటికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.