మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        టీఎన్ఆర్ఐ

అమెరికాలో ముగ్గురు మృత్యువాత

Updated:2016-12-23 12:31:29

views:898

అమెరికాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నగరానికి చెందిన తల్లీ కుమారుడితో పాటు మరో యువకుడు మరణించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కథనం ప్రకారం.. మౌలాలికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రత్నాకర్‌ షెట్టిపల్లి, సుష్మ దంపతులు ఎనిమిదేళ్లుగా అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నారు. వీరికి పిల్లలు కీర్తన(6), మహీధర్‌(4) ఉన్నారు. ఆదివారం రాత్రి వారంతా బంధువులతో కలిసి కారులో సెయింట్‌లూయిస్‌ వెళ్తున్నారు. కారును సుష్మ(32) నడుపుతుండగా తప్పుడు మార్గం(రాంగ్‌రూట్‌)లో వచ్చిన ఓ కారు వీరిని ఢీకొంది. దీంతో సుష్మతోపాటు కుమారుడు మహీధర్‌ అక్కడికక్కడే మరణించగా, రత్నాకర్‌, కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు ఉన్న బంధువులు సైతం స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం రత్నాకర్‌ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలిసి లంగర్‌హౌస్‌ దరి కనకదుర్గాకాలనీలోని సుష్మ తండ్రి దయామోహన్‌ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.