మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        టీఎన్ఆర్ఐ

లండన్‌లో తెలంగాణ దీక్షా దివస్‌

Updated:2016-12-23 12:27:29

views:998

తెలంగాణ సాధనలో తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌ 2009 నవంబరు 29న చేపట్టిన ఆమరణ దీక్షను చేపట్టడం రాష్ట్రసాధనలో కీలకమలుపుగా చెప్పవచ్చు. ఆ నాటి దీక్షను పురస్కరించుకొని లండన్‌లో తెరాస, కేసీఆర్‌ మద్దతుదారుల సంఘం ఒక్క రోజు దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా సంఘ స్థాపకులు చంద్రశేఖర్‌ ప్రసంగిస్తూ బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తామన్నారు. వ్యాపారవేత్త గోలి తిరుపతి ప్రసంగిస్తూ యూకేలో సంఘ స్థాపన కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్‌కుమార్‌, రంగువెంకట్‌, నరేష్‌గుప్తా, . అజయ్‌ పోల్కంపల్లి, నవీన్‌ ఎల్కుర్‌, రామాగౌడ్‌, మహేష్‌ నాంపల్లి, శ్రీ లక్ష్మి, దీప, ప్రీతి, కీర్తిపొన్నాల, నగేశ్‌ కాసర్ల, ప్రమోద్‌ అంతటి, సుమన్‌, మధుకర్‌, రఘుగౌడ్‌... తదితరులు పాల్గొన్నారు.