మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

ఆపిల్‌ అద్దం

Updated:2016-12-27 12:49:23

Views:70

ఆపిల్‌ పండు తెలుసు, ఆపిల్‌ ఫోను తెలుసు... ఇదేంటి కొత్తగా ఆపిల్‌ అద్దం అనుకుంటున్నారా?
ఫొటోలో మీరు చూస్తున్నది అద్దం లాంటిదే... కానీ అద్దం కాదు. ఎందుకంటే ఇది మొబైల్‌. న్యూయార్క్‌కు చెందిన రాఫెల్‌ డైమెక్‌ అనే వ్యక్తి మొబైల్‌లా పని చేసే ఈ స్మార్ట్‌ అద్దాన్ని రూపొందించారు. ఐఓఎస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ అద్దం పని చేస్తుంది. ఇది పని చేసే విధానాన్ని డైమెక్‌ ఓ వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టాడు. అందులో ఆప్స్‌ వినియోగం, సెట్టింగ్స్‌ మార్చుకోవడం లాంటి పనులు చేసి చూపించాడు. అయితే ఇలాంటి అద్దాల్ని అమ్మకానికి పెట్టే అవకాశం ఉన్నదీ లేనిదీ డైమెక్‌ ఈ వీడియోలో చెప్పలేదు. అయితే ఇది గ్రాఫిక్‌ మాయనా, నిజమా అనేది తెలియడం లేదు. కావాలంటే మీరూ ఈ లింక్‌లో (https://goo.gl/8aAOKt) ఆ వీడియోను చూడండి.