మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

ఫ్యాబ్‌2 ప్రోను ఆవిష్కరించిన లెనోవో

Updated:2016-12-27 12:32:17

Views:89

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఫ్యాబ్‌2 ప్రోను లెనోవో ఆవిష్కరించింది. ప్రత్యేక సెన్సార్లు, గూగుల్‌ సాఫ్ట్‌వేర్‌ టాంగో టెక్నాలజీ సహాయంతో రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌ పరిసరాలను గుర్తించి మ్యాప్‌ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న గది సైజ్‌, గదిలో ఇతర మనుషులు, తలుపులు, గోడలు.. తదితర వస్తువులను గుర్తించగలదు. ప్రత్యేక ఫీచర్లతో విడుదలైన ఈ ఫ్యాబ్‌2 షిప్పింగ్‌ అమెరికాలో ఆగస్టులో ప్రారంభంకానుంది. దీని ధర 500 డాలర్లుగా లెనోవో ప్రకటించింది. ఈ ఫోన్‌ అన్ని దేశాల్లో సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫోన్‌ ఫీచర్లు..

* 6.4 అంగుళాల తెర
* 1.8 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌
* 16 ఎంపీ వెనుక కెమెరా
* 8 ఎంపీ ముందు కెమెరా
* 4 జీబీ ర్యామ్‌
* ఆండ్రాయిడ్‌ 6.0
* 64జీబీ స్టోరేజి
* 4050 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ