మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

వీడియోకాన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌

Updated:2016-12-27 12:28:25

Views:103

న్యూదిలీ: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ వీడియోకాన్‌ సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. క్రిప్టన్‌3 వీ50జేజీ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధర రూ.10,000గా కంపెనీ ప్రకటించింది. రెండు రంగుల్లో వినియోగదారులకు లభ్యం కానుంది.

ఫోన్‌ ఫీచర్లు..

* 5 అంగుళాల తాకే తెర
* 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రొసెసర్‌
* 2జీబీ రామ్‌
* ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మెల్లో
* 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమెరా
* ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌
* 5 మెగాపిక్సల్‌ ముందు కెమెరా
* 16జీబీ అంతర్గత మెమరీ
* 64 జీబీ వరకు మెమరీ కార్డ్‌ ద్వారా పెంచుకునే సదుపాయం
* 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సదుపాయం
* 4జీ సదుపాయం
* డ్యూయల్‌సిమ్‌