మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

ముచ్చట్లతో వార్తలు

Updated:2016-12-27 12:16:24

Views:57

క్షణానికి, ఏ మూల, ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే ఆసక్తా! వార్తల సంబంధిత ఆప్స్‌తో బోర్‌ కొట్టేసిందా? అయితే Quartz ఆప్‌ను ప్రయత్నించండి. జాతీయ, అంతర్జాతీయ సమాచారాన్ని చిటికెలో సులభంగా తెలుసుకోవచ్చు. స్నేహితునితో ఛాటింగ్‌ చేస్తున్నట్లే ఈ ఆప్‌తో ఛాట్‌ చేస్తూ తాజా వార్తలు తెలుసుకోవచ్చు. ఈ ఆప్‌ ఓపెన్‌ చేయగానే మొబైల్‌ ఆప్‌ మీతో ఛాటింగ్‌ మొదలుపెడుతుంది. తర్వాత like this ట్యాబ్‌ను ఒత్తాలి. ఆ తర్వాత ఒక సంక్షిప్త వార్త తెరపైకి వస్తుంది. దాని కింద tell me more, anything else అప్షన్లు కనిపిస్తాయి. ‘టెల్‌ మీ మోర్‌’ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే పై వార్తకు సంబంధించిన అదనపు సమాచారం వస్తుంది. ‘ఎనీ థింగ్‌ ఎల్స్‌’ క్లిక్‌ చేస్తే... వేరే వార్త కనిపిస్తుంది. అలా వరుసగా వార్తలు చదువుకోవచ్చు.