ఇతర వార్తలు

హైదరాబాద్‌కు ఏం చేయాలో స్పష్టత ఉంది

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్‌ అభివృద్ధి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

తిరుపతిలో కొత్తరైళ్ల సందడి

తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు రెండు కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29వ తేదీన తిరుపతి నుంచి గోవాకు వాస్కోడిగామా రైలును కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు ప్రారంభించనున్నారు. మరుసటి రోజు తిరుపతి నుంచి విశాఖపట్నంకు డబుల్‌డెక్కర్‌ రైలును ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు రానున్న నేపథ్యంలో గుంతకల్లు డివిజన్‌ డీఆర్‌ఎం అజిత్‌ఓజా, అడిషినల్‌ డీఆర్‌ఎం కె.వి.సుబ్బరాయుడు, ఎల్‌ఒ సత్యనారాయణ, స్టేషన్‌ మేనేజర్‌ సుబోధ్‌మిత్రా, డీఈ దినేష్‌రెడ్డి తదితర ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి స్టేషన్‌ మాస్టర్‌ గది ప్రాంతంలో వేదికను ఏర్పాటు చేసి.. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా తిరుపతి- గోవా మధ్య నడిచే వాస్కోడిగామా రైలును మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం వేదిక నుంచి ప్రసంగించనున్నారు.