మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

మోదీ దుస్తులు మార్చినట్టే వాళ్ల రూల్స్‌ కూడా!

Updated: 2016-12-21 14:30:28 Views: 218

దిల్లీ: దేశంలో పెద్దనోట్ల రద్దు అనంతరంఆర్బీఐ చేస్తోన్న ప్రకటనలు, నోటిఫికేషన్లను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు ఒకే రోజు పలుమార్లు దుస్తులు మార్చినట్టుగానే ఆర్బీఐ అధికారులు నియమనిబంధనలు మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్బీఐ అధికారులు ప్రకటించిన వివిధ విధానాలకు సంబంధించిన ఓ ఆర్టికల్‌తో పాటు ఈ వ్యాఖ్యను ఆయన ట్విట్టర్లో పోస్ట్‌చేశారు.

షేర్ :


రాజకీయం

ప్రాజెక్టుల కోసం ఒక్కపైసా అప్పు చేయలేదు

నీటిపారుదల ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా అప్పు చేయలేదని జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీటి కోసమే జరిగిందని.. రాష్ట్రం ఏర్పడి తర్వాత ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టుల కోసం పదేళ్ల కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మొత్తం రూ.39 వేల కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లోనే రూ.. 22వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. ఈ నిధులన్నీ రాష్ట్ర ఖాతాలోనివేనని.. ఎవరి నుంచి అప్పు తీసుకురాలేదని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల వూబిలోకి నెట్టుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని పేర్కొన్నారు.


జనరల్‌

సుపరిపాలనతోనే వాజ్‌పేయీకి ప్రఖ్యాతులు

ప్రజలకు సుపరిపాలన అందించడం ద్వారా మాజీ ప్రధాని వాజ్‌పేయీ అంతర్జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన వాజ్‌పేయీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల జీవితాలు బాగుపడాలని వాజ్‌పేయీ తరుచూ చెప్పేవారని.. ఇప్పుడు మోదీ దానిని ఆచరణలో పెడుతున్నారని అన్నారు. మంచి పనులు చేయడానికి దేశాన్ని బాగుచేయడానికి మోదీ ప్రధాని అయ్యారని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 31 తర్వాత సామాన్యులు కష్టాలు తొలగి అక్రమంగా డబ్బులు సంపాదించిన వారికి కష్టాలు మొదలవుతాయన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. వాజ్‌పేయీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆయన వస్త్రాలు పంపిణీ చేశారు.