మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

జారుడుమెట్లపై కాంగ్రెస్‌!

Updated: 2016-12-21 11:13:58 Views: 811

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ మధ్య తన అత్తగారైన ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తేశారు. ఆమె దయగల తల్లి అని, కరుణామయి అని కొనియాడారు. అదంతా నిజమై ఉంటే ఎంత బావుణ్ను! వాస్తవం భిన్నమైనది. వ్యక్తిగత స్వేచ్ఛపట్ల ఇందిరకు కించిత్తు గౌరవం ఉన్నా, 1975లో అత్యవసర పరిస్థితి సందర్భంగా లక్షమందిని ఎలాంటి విచారణ లేకుండా నిర్బంధించేవారా? పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసేవారా? మంచి-చెడు, నైతికత-అనైతికతల మధ్యగల సన్నని గీతను చెరిపివేయడానికీ వెనకాడని రీతిలో ఆనాటి సమాజాన్ని తయారుచేసేవారా? అలాగని, ఇందిరాగాంధీ గొప్ప పనులేమీ చేయలేదని కాదు. పశ్చిమ పాకిస్థాన్‌ సైన్యం పదఘట్టనల కింద నలిగిపోతున్న తూర్పు పాకిస్థానీయులకు విముక్తి ప్రసాదించి, బంగ్లాదేశ్‌ పేరిట కొత్త దేశానికి వూపిరిపోయడంలో ఆమె పాత్ర అనితరమైనది. పాక్‌ పంజాబీ సైన్యం అప్పట్లో బంగ్లా ప్రజానీకాన్ని ఎంతగా హింసించేదో, ఎంత కిరాతకంగా హతమార్చేదో ఇందిరాగాంధీ తమకు భోజన సమయంలో కథలు కథలుగా చెప్పేవారని ఒక ఇంటర్వ్యూలో సోనియాగాంధీ గుర్తు చేసుకొన్నారు. అది నిజమే. అప్పటి పాక్‌ సేనల అరాచకాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. బంగ్లాదేశ్‌ విముక్తి అన్నది ఇందిరాగాంధీ సాధించిన గొప్ప విజయం. పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేసినందుకు ఇందిరాగాంధీని దుర్గామాతగా పొగిడారు ఆనాటి ప్రతిపక్షనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ. బంగ్లాదేశ్‌ ఏర్పాటు దరిమిలా తూర్పువైపు నుంచి భారత్‌పై దాడి జరిగే ప్రమాదం తప్పిపోయింది. పశ్చిమ పాకిస్థాన్‌ బంగ్లాదేశీయులను రెండో తరగతి పౌరులుగా చిన్నచూపు చూసేదని, వారు తిరుగుబాటు బావుటా ఎగరేసి, పాక్‌ సంకెళ్ల నుంచి బయటపడటానికి అదే అసలు కారణమని హమూదర్‌ రెహ్మాన్‌ కమిషన్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. అయినప్పటికీ, తమదేశ విభజనకు భారతే కారణమని పాకిస్థాన్‌ నేటికీ నిందారోపణలు చేస్తోంది. కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది.

షేర్ :


రాజకీయం

ప్రాజెక్టుల కోసం ఒక్కపైసా అప్పు చేయలేదు

నీటిపారుదల ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా అప్పు చేయలేదని జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీటి కోసమే జరిగిందని.. రాష్ట్రం ఏర్పడి తర్వాత ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టుల కోసం పదేళ్ల కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మొత్తం రూ.39 వేల కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లోనే రూ.. 22వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. ఈ నిధులన్నీ రాష్ట్ర ఖాతాలోనివేనని.. ఎవరి నుంచి అప్పు తీసుకురాలేదని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల వూబిలోకి నెట్టుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని పేర్కొన్నారు.


జనరల్‌

సుపరిపాలనతోనే వాజ్‌పేయీకి ప్రఖ్యాతులు

ప్రజలకు సుపరిపాలన అందించడం ద్వారా మాజీ ప్రధాని వాజ్‌పేయీ అంతర్జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన వాజ్‌పేయీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల జీవితాలు బాగుపడాలని వాజ్‌పేయీ తరుచూ చెప్పేవారని.. ఇప్పుడు మోదీ దానిని ఆచరణలో పెడుతున్నారని అన్నారు. మంచి పనులు చేయడానికి దేశాన్ని బాగుచేయడానికి మోదీ ప్రధాని అయ్యారని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 31 తర్వాత సామాన్యులు కష్టాలు తొలగి అక్రమంగా డబ్బులు సంపాదించిన వారికి కష్టాలు మొదలవుతాయన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. వాజ్‌పేయీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆయన వస్త్రాలు పంపిణీ చేశారు.