మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

3 గంటల్లో 370 కిలోల బంగారం విక్రయం! ముసద్దిలాల్‌ జ్యువెలర్స్‌ అక్రమాలు

Updated: 2016-12-16 16:05:55 Views: 558

ఈనాడు, హైదరాబాద్‌: నోట్ల రద్దు ప్రకటన అనంతరం... నగరంలోని ముసద్దిలాల్‌జ్యువెలర్స్‌, వైష్ణవి బులియన్స్‌, ముసద్దిలాల్‌ జెమ్స్‌, జ్యువెలర్స్‌ వ్యాపారులు కేవలం మూడు గంటల్లోనే 5,200 మంది వినియోగదారులు 370 కిలోల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టు రికార్డు సృష్టించారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోండని ఆదాయపన్ను అధికారులు సెంట్రల్‌ క్రైమ్‌స్టేషన్‌ పోలీసులను కోరారు. దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయాలని డీసీపీ (నేరపరిశోధన) అవినాష్‌ మొహంతిని గురువారం కోరారు

షేర్ :


రాజకీయం

తెలంగాణ గవర్నర్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌

తెలంగాణ గవర్నర్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌
దుబ్బాకలో గెలిచే ధమ్ము కాంగ్రెస్‌కు ఉందా?
త్వరలో జరుగునున్న దుబ్బాక బై ఎలక్షన్‌ల్లో కాంగ్రెస్‌కు గెలిచే ధమ్ము కాంగ్రెస్‌ ఉందా? దుబ్బాకలో పూర్తిస్థాయిలో క్యాడర్‌ కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ గౌరవ ప్రదమైన ప్రదర్శన్‌ ఇస్తుందా? దుబ్బాక బైల ఎక్షన్‌లలో తిరిగి ఘన విజయం సాధించడానికి ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌రావును టిఆర్‌ఎస్‌ రంగంలోకి దించింది. సరైన అభ్యర్ది లేక కునికిపట్లు పడుతున్న కాంగ్రెస్‌కు  దుబ్బాక ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిస్తోంది. నియోజకవర్గంలోని 120కి పైగా గ్రామాలలో నేతలను రంగంలోకి దింపుతోంది. రెండు గ్రామాలకు ఒక  నేతను నియమించింది కాంగ్రెస్‌ పార్టీ. నాయకులకు కేటాయిస్తున్న గ్రామాలలో నాయకులు అక్కడే ఉండి పని చేయాలని నిబంధన విదించింది. బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల పట్ల ప్రతిపక్ష పార్టీల పట్ల చాలా నియంతృత్వనగా పని చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాల పనితీరును ప్రజలల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశనిర్దేశం చేస్తోంది. 
దుబ్బకా ఎన్నికల్లో వ్యూహరచన, రాష్ట్రంలో గవర్నర్‌ తీరుపై కాంగ్రెస్‌ పార్టీ విశ్లేషించింది. గాంధీభవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేఃలో  ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, వ్ శ్రీనివాస్ కృష్ణన, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్యెల్యే సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, ముఖ్య నాయకులు, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంత రావ్, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, మర్రి శశిధర్ రెడ్డి,  దామోదర్ రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, నెరేళ్ల శారదా, దాసోజ్ శ్రవణ్, మాజీ ఎంపీ లు, మాజీ ఎమ్యెల్యేలు పాల్గొన్నారు. సమావేశంలో గవర్నర్‌పై కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు.  తెలంగాణ గవర్నర్ కూడా కాంగ్రెస్ నాయకులను కలవకూడదని నిర్ణయం తీస్కున్నట్టు అనిపిస్తుందని, ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రజా ప్రతినిధులు ఎంపీ లు, ఎమ్యెల్యేలు, ముఖ్య నాయకులు కలుస్తాం అన్నా.. కరోనో పేరు చెప్పి అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం అవకాశమిస్తున్న గవర్నర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను రాజ్‌భవన్‌ గడప తొక్కనివ్వడంలేదని కాంగ్రెస్‌ బృందం దుమ్మెత్తిపోసింది. గవర్నర్, బీజేపీ, టిఆర్ఎస్ అంత ఒక్కటే అనిపిస్తుందన్న కాంగ్రెస్‌ నేతలు  ఇలాంటి పరిస్థితులలో మనం ప్రజల పక్షాన మరింత కష్టపడి పని చేసి ప్రజా సమస్యలను పరిష్కరించే విదంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు..
 


జనరల్‌

సుపరిపాలనతోనే వాజ్‌పేయీకి ప్రఖ్యాతులు

ప్రజలకు సుపరిపాలన అందించడం ద్వారా మాజీ ప్రధాని వాజ్‌పేయీ అంతర్జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన వాజ్‌పేయీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల జీవితాలు బాగుపడాలని వాజ్‌పేయీ తరుచూ చెప్పేవారని.. ఇప్పుడు మోదీ దానిని ఆచరణలో పెడుతున్నారని అన్నారు. మంచి పనులు చేయడానికి దేశాన్ని బాగుచేయడానికి మోదీ ప్రధాని అయ్యారని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 31 తర్వాత సామాన్యులు కష్టాలు తొలగి అక్రమంగా డబ్బులు సంపాదించిన వారికి కష్టాలు మొదలవుతాయన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. వాజ్‌పేయీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆయన వస్త్రాలు పంపిణీ చేశారు.