Breaking News
Breaking News
హాట్ న్యూస్
Updated: 2016-12-16 15:30:47 Views: 419
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్ క్రికెట్ ఆటగాడు అలిస్టర్ కుక్ అరుదైన రికార్డును అందుకున్నాడు. చెన్నై వేదికగా భారత్‌తో మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో కుక్ 11వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.140వ టెస్టు ఆడుతున్న కుక్ మొత్తం 252 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 11వేల పరుగుల మైలు రాయిని అందుకున్న పదో బ్యాట్స్‌మెన్‌గా కుక్ అరుదైన ఘనత సాధించాడు
షేర్ :
ప్రజలకు సుపరిపాలన అందించడం ద్వారా మాజీ ప్రధాని వాజ్‌పేయీ అంతర్జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన వాజ్‌పేయీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల జీవితాలు బాగుపడాలని వాజ్‌పేయీ తరుచూ చెప్పేవారని.. ఇప్పుడు మోదీ దానిని ఆచరణలో పెడుతున్నారని అన్నారు. మంచి పనులు చేయడానికి దేశాన్ని బాగుచేయడానికి మోదీ ప్రధాని అయ్యారని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 31 తర్వాత సామాన్యులు కష్టాలు తొలగి అక్రమంగా డబ్బులు సంపాదించిన వారికి కష్టాలు మొదలవుతాయన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. వాజ్‌పేయీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆయన వస్త్రాలు పంపిణీ చేశారు.