SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

తెలుగు వారు పట్టించుకోని గొప్ప ఉద్యమం ఢిల్లీలో రైతు ఉద్యమం..

Updated: 2021-01-04 00:32:49

 తెలుగు వారు పట్టించుకోని గొప్ప ఉద్యమం ఢిల్లీలో రైతు ఉద్యమం..
సీనియర్ పాత్రికేయులు... రామచంద్రమూర్తి కమెంట్స్‌
కాంగ్రెస్ పార్టీ అవసరం ఈ సమాజానికి చాలా అవసరం..
అలాగే పివి నర్సింహారావు సమాజానికి అవసరం..
2012 వరకు తను పివి మెమోరియల్ లెక్చుర్స్ నేను hmtv లో ఉన్నప్పుడు ప్రారంభించాను..
చాలా గొప్ప నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. 
పివి గారితో నాకు చాలా సార్లు కలిసే అవకాశం వచ్చింది..
పివి తనతో మాట్లాడుతూ తాను భూ సంస్కరణలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఒడిపోయాను, ఆర్థిక సంస్కరణలు అమలు చేసి కేంద్రంలో ఓడిపోయము అన్నారు. 
పివి బహు బాషావేత, రచయిత.. ఆయన పదవిలో ఉంటే చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకునే వారు.
పివి గురించి తెలిసిన వ్యక్తికి తెలుసు.. ఆయనలో ఒక తిరుబాటు వ్యక్తి ఉన్నాడు. 
బూర్గుల రామకృష్ణారావు టెనెన్సీ ఆక్ట్ తెస్తే, పివి..భూ సంస్కరణలు తెచ్చారు.
భూస్వాములు అహంకారంతో ఉన్నారు. వారి భూములు తగ్గిస్తే పేదలకు భూములు వస్తాయి, భూ స్వాముల అహంకారం తగ్గుతుంది అని అనేవారు.
పివి హయాంలో దాదాపు మూడున్నర లక్షల ఎకరాల భూమిని తోసుకొని రెండున్నర లక్షల మందికి పంపిణీ చేశారు  
సామాజిక న్యాయం చేయడంలో పివి కృతనిశ్చయంతో పని చేసారు..
1972 లో ఆయన 70 శాతం టికెట్లు ఎస్డీలకు, ఎస్ర్తిలకు, బీసీ లకు ఇచ్చిన ఘనత పివి గారిది..
ఇది పెద్దగా ప్రచారం చేయకపోవడం ఆయన గురించి ప్రచారం జరగలేదు. ఆయన త్రికరణ శుద్దిగా పని చేసారు.
పార్లమెంట్ లో అన్ని స్థాయి సంఘాల ఉండాలని నిర్ణయించింది కూడా పివి గారే..
అన్ని బిల్లులు సెలెక్ట్ కమిటీ కి పోకుండా చట్టాలు కావద్దని పివి గారే చేశారు..
ఇప్పుడు బీజేపీ ప్రభుతం రైతుల నడ్డివిరిచే మూడు వ్యవసాయ బిల్లులను ఏకపక్షంగా అమలు చేశారు.
ఎముకలు కొరికే చలి లో రైతులు 40 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు..
పివి హయాంలో స్వామినాథన్ కమిషన్ నివేదిక ఉండిఉంటే ఆయన కచ్చితంగా అమలు చేసేవారు..
దేశంలో తెలుగు వారు పట్టించుకోని గొప్ప ఉద్యమం ఢిల్లీలో రైతు ఉద్యమం..
రైతుల ఉద్యమం తెలంగాణ లో బలోపేతం చేస్తే పివి గారి ఆత్మ సంతోశించేవారు..
ఢిల్లీలో జరిగే ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఇంత పెద్దగా జరగలేదు..
పివి గారి గురించి ఎంత ఎక్కువ మాట్లాడుతే మనకు అంత గౌరవం పెరుగుతుంది.