సింగర్ సునీత రెండో పెళ్లి
కొత్త భర్త మ్యాంగో రామ్
ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే సునీత పెళ్లి చేసుకునే రామ్‌కి కూడా ఇది రెండో వివాహమే. చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సునీత
కాగా సునీత ఎంగేజ్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అయితే ఈ విషయంపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై గాయని సునీత స్పందించారు. త్వరలో రామ్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసి తన జీవితాన్ని పంచుకోబోతన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్ననట్లు తెలిపారు. ఇప్పటి వరకు అండగా నిలిచిన పిల్లలకు, తల్లిదండ్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రామ్‌తో నిరాడంబరంగా జరిగిన నిశ్చితార్థపు ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేశారు. చదవండి: సింగర్ సునీత ఎంగేజ్మెంట్.
‘అందరి తల్లిలాగే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఉన్నతంగా స్థిరపడేలా చూసేందుకు కలలు కంటున్నాను. అలాగే నా పిల్లలు కూడా నేను జీవితంలో స్ధిరపడాలని కోరుకున్నారు. అలాంటి అద్భుతమైన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. చివరికి ఆ క్షణం వచ్చింది. నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్ భాగస్వామిగా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరంలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఎప్పటిలాగే నన్ను ఆదరించి, మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా’.. అంటూ ముగించారు.