SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

ఒరేయ్‌ బుజ్జిగా వేస్ట్‌ గురూ

Updated: 2020-10-07 07:02:15

 ఒరేయ్‌ బుజ్జిగా వేస్ట్‌ గురూ
పాత చింతకాయ పచ్చడిని కొత్త సీసాలో వేసుకుని ఒడ్డించడమంటే ఇదేనేమో. హిట్స్‌ లేక చతికిలపడుతున్న రాజ్‌తరుణ్‌ బుజ్జిగాడి మరోసారి నిరాశే ఎదురైంది.  నిర్మాత ఓటిటిలో అమ్ముకున్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే చేతులు కాళ్లు రెండు కాల్చుకునేవాడే. ధియేటర్‌లో రెండు రోజులకే బోర్డు తిప్పే రొటిన్‌ మూవీ బుజ్జిగాడు. సెంటిమెంట్‌ వర్క్‌ అవుతుందని కుమారి 20 ఎఫ్‌ ఫేమ్‌ హెబ్బా పటేల్‌ను పెట్టుకున్నా సినిమాకు కలిసిరాలేదు. సాదా సీదా సీన్లతో రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ నుంచి సిటీ వరకు కథ నడిపించినా  కథనంలో పట్టులేకపోవడం, ఇలాంటి కథలు గతంలో చాలానే రావడంతో పెద్దగా ఆసక్తిలేకుండా పోయింది. సప్తగిరి కామెడీ కొంచెం ఆకట్టుకోవడం తప్ప కామెడీ అంతా తేలిపోయింది. దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా కొండంత ఆశతో తీసిన ఈ ఒరేయ్‌ బుజ్జిగా సినిమా బజ్జీలు తిన్నంత సేపు కూడా ఆసక్తి చూడలేం. హిరోయిన్‌ మాళవిక నాయర్‌ ఏమాత్రం సూట్‌ కాలేదు. డబ్బింగ్‌తో కవర్‌ చేసిన బ్యాడీ ల్వాంగేజ్‌ ఏమాత్రం మూవీ ఎసెట్‌ కాలేదు. హెబ్బా పటేల్‌ ది వ్యాంప్‌ క్యారెక్టర్‌ అసహ్యం కలిగించింది. సప్తగిరి తనదైన శైలితో కామెడీ చేసి పరావేలేదనిపించాడు. వాణి విశ్వనాత్‌ పాత్ర 1990లోని వాణిశ్రీని తలపించి తప్ప కొత్తగా చేసింది ఏమిలేదు. చాముండేళ్వరీ పేరు కూడా చాలా సినిమాల్లో వాణిశ్రీకి వాడేశారు. పోసాని, నరేశ్‌ వాళ్ళవాళ్ళ పాత్రకు తగినట్లు న్యాయం చేశారు. లాక్‌ డౌన్‌తో ఆలస్యమైన ఒరేయ్‌ బుజ్జి సినిమా ఓటీటీలో రిలీజ్‌ చేసిన నిర్మాత తగిన న్యాయం చేశాడు.
రేటింగ్‌ 1.5/5