తూర్పుగోదావరిజిల్లా ఉప్పాడసముద్రంతీరం రెండు రంగులుగా మారింది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో లక్షలాది తూనిగలు ఆకాశంలో సంచారం. ఇది ప్రకృతి వైపరిత్యమా ? అని ప్రజలు భయపడుతున్నారు. ఉప్పాడలో ఒకవైపునీలంరంగు, మరోవైపు ఎరుపురంగులతోసముద్రం తీరం మారడంతో భయందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరొకవైపసు కోనసీమలో తూనికల దండయాత్ర ప్రకృతి విపత్తులు సంభవించే సంకేతం అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫానులు, సునామీలు సంభవించే ముందు ఇలా తూనిగల వస్తాయి, సముద్రం రెండు రంగులుగా మారుతుందని అంటూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎప్పుడు వేలల్లో వచ్చే తునిగాలు ఈసారి లక్షల్లో దండయాత్రగా రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఊపిరిబిగపట్టుకుని చూస్తున్నారు.
మరోవైపు ఉప్పాడ సముద్రం తీర ప్రాంతం రంగులు మారుతోంది. ఉప్పాడ సముద్రం రెండు రంగుల్లో కనిపించింది. ఒకపక్క బురద నీరు..మరో పక్క నీలి రంగులో సముద్రం కనిపించడం తో సునామికి సూచిక అంటూ విశ్లేషిస్తున్నారు. తుఫాను వచ్చే ముందు సముద్రం రంగు మారుతుందని అంటున్నారు నిపుణులు.