టిఆర్ఎస్ వ్యూహంలో ఇరుక్కపోయిన కాంగ్రెస్.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి గెలిస్తే టిఆర్ఎస్లో చేరడని గ్యారెంటీ ఏంటి?
ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లోకి క్యూకడుతున్న కాంగ్రెస్ నేతలు గుణపాఠం నేర్చుకోరా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సాధ్యమైనంత మేరకు నష్టం కలిగించడంలో ఆ పార్టీ నేతలు చాలా మంది విజయం సాధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలో భూస్థాపింతం అయింది. తెలంగాణలో కాస్తో కూస్తో ఉనికి ఉన్నా ఏపీలో మాత్రం మరో 50ఏళ్ల అయినా కోలుకును పరిస్థితి అయితే లేదు. రెడీమెడ్ నేతలకు టికెట్లు, పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ సాంప్రదాయంగా భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేని నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీని నిండా ముంచారు నేతలు. అధికారం చిక్కినట్లే చిక్కి టి కాంగ్రెస్ నేతల అతి పోకడలతో ముఖం చాటేసింది. టికెట్ల ఖరారు, తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ చంద్రబాబునాయుడును తెలంగాణ ఎన్నికల క్యాంఫెన్లో తిప్పడం వెరసి కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు మరోసారి తిరస్కరించారు. చివర వరకు టికెట్ల ఖరారు చేయకుండా ఆలస్యం చేయడం, పార్టీ నేతల మధ్య సయోధ్యలేకపోడం, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం లాంటి చర్యలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన ఎంపి ఎన్నికల్లో టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కనబరిచన ప్రజలు తెలంగాణ గ్రామీణంలో అంతంత మాత్రంగానే ఉన్న బిజెపికి ఉత్తర తెలంగాణలో 3ఎంపి స్థానాలు కట్టబెట్టారు. కాంగ్రెస్ కూడా 3స్థానాలు కట్టబెట్టారు. సికింద్రాబాద్‌లో కలుపుకుని బిజెపికి 4పార్లమెంట్ స్థానాలు కట్టబెడితే కాంగ్రెస్‌కు దక్కినవి కేవలం 3స్థానాలే. ప్రజావ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవడంలో కాంగ్రెస్‌కన్నా ఎక్కువగా బిజెపి విజయం సాధించింది.
ఈ అనుభవాల నుంచి ఏమాత్రం గుణపాఠం నేర్చకోలేని కాంగ్రెస్ తన సాంప్రదాయ పద్దతులను ఏమాత్రం విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీని మరింత భూస్థాపితం చేసే దిశకే తీసుకెళ్లడానికి పూనుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీల ఉన్నత పదవులు అనుభవించిన నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన తరువాత టిఆర్ఎస్ విసిరన వలలో పడి సొంత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి టిఆర్ఎస్లో దూకారు 12 మంది ఎమ్మెల్యేలు. అయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలలో ఏమాత్రం మార్పురావడంలేదు. ఆర్ధికంగా దిగజారిన దళిత ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ చూపిన ప్రలోభాలకు తలొగ్గకుండా పార్టీలో కొనసాగితే ఆర్ధిక బలవంతులు, కాంగ్రెస్ పార్టీతో అన్ని ప్రయోజనాలు పొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గోడ నుంచి టిఆర్ఎస్లో జంప్ చేశారు. కాంగ్రెస్‌కు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలేకుండా చేశారు.
ఈనేపథ్యంలో జరుగుతున్న దుబ్బాక ఎన్నికల్లో మరో చారిత్రక తప్పిదానికి తెలంగాణ కాంగ్రెస్ ఒడిగడుతోంది. దివంగత ముత్యంరెడ్డికి కాంగ్రెస్ అనేక సార్లు టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేను చేసింది. మంత్రి పదవి కూడా ఇచ్చింది. చివర దశలో ఆయన టిఆర్ఎస్లో చేరారు. ఆయన కొడుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా టిఆర్ఎస్ కండువ కప్పుకుని జై టిఆర్ఎస్ అన్నాడు. మత్యంరెడ్డి మృతితరువాత దుబ్బాకలో ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకుని పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో జరుగబోయే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ టికెట్ ఆశించాడు. టిఆర్ఎస్ మాత్రం రామలింగారెడ్డి సతీమణి సుజాతకే టికెట్ కట్టబెట్టింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డికి చుక్కెదురైంది. పదవులు, టికెట్ల కోసమే అన్నట్లుగా గులాబీ జెండాను విసిరేసి టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్‌లో చేరుతానని షరతు విధించాడు. కాంగ్రెస్ దుబ్బాక అభ్యర్దిగా అప్పటి వరకు నర్సారెడ్డిని పేరును ఖరారు చేసి ఇప్పుడు చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఖరారు చేయబోతోంది. టిఆర్ఎస్ వ్యూహం కూడా అదే. చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని భావించింది. అనుకున్నట్లుగానే శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేయడంతో టిఆర్ఎస్ పని ఈజీ అయిపోయింది. టిఆర్ఎస్ చట్రంలో ఇరుక్కున్న కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఖరారు చేయబోతోంది.
నిజానికి టిఆర్ఎస్కు ప్రత్యర్ధి తమ పార్టీకి చెందిన నేత ఉండడమే తేలికగా అని భావించి వ్యూహాత్మకంగా శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ గడప తొక్కించి పోటీ చేపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ దురదుష్టవశాత్తు టిఆర్ఎస్ ఓడిపోయి శ్రీనివాస్‌రెడ్డి గెలిచిన మళ్లీ టిఆర్ఎస్ గూటిలోకి చేరడం, చేర్పించుకోవడం టిఆర్ఎస్కు పెద్దపనేం కాదు. సో టిఆర్ఎస్ ఉక్కు చట్రంలో కాంగ్రెస్ మరోసారి ఇరుక్కపోయింది.
-రాజ్యలక్ష్మి డి
-ఎంసిజె