బ్యాలెట్‌ను వ్యతిరేకించిన టిఆర్ఎస్ హఠాత్తుగా
జిహెచ్ఎంసి ఎన్నికల్లో బ్యాలెట్‌కు ఎందుకు సై అంది?
తెలంగాణలో టిఆర్ఎస్ విజయంపరంపర ప్రారంభమైన తరువాత బ్యాలెట్కుతో ఓటింగ్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి నో అంటూ వస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు మొగ్గుచూపుతూ వస్తోంది. త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరుపాలని పట్టుపట్టింది. ప్రధాన రాజకీయ పక్షాలు కొన్ని బ్యాలెట్‌ను వ్యతిరేకించినప్పటికీ టిఆర్ఎస్ డిమాండ్ చేసినట్లుగా బ్యాలెట్ తరహాలో ఓటింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గుర్తింపు పొందిన, నమోదైన 50 రాజకీయపక్షాల్లో 26 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. అందులో 13 రాజకీయ పార్టీలు బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కోరగా .. మూడు పార్టీలు ఈవీఎంల ద్వారా నిర్వహించాలని తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచాయి. మెజారిటీ రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు... 2020లో జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించామని ఎన్నికల సంఘం తెలిపింది. జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన కార్పొరేషన్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కరోనా కారణం కాదు. ఈవీఎంలు…వీవీప్యాట్ లు అందుబాటులో లేకపోవడమే కారణమని రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కరోనా కారణంగా ఈవీఎంలు వద్దని బ్యాలెట్‌నే వాడాలని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. అయితే కరోనా ఉన్నప్పటికీ.. బీహార్‌తో పాటు ఇతర ఉపఎన్నికల్ని ప్రత్యేక జాగ్రత్తలతో ఈసీ నిర్వహిస్తున్నందున ..అలాగే గ్రేటర్ ఎన్నికలు కూడా నిర్వహించాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. ఇదే అభిప్రాయాన్ని ఎస్ఈసీకి లిఖిత పూర్వకంగా తెలిపారు. అయితే తెలంగాణ అధికారపార్టీ …టీఆర్ఎస్కు మాత్రం ఈవీఎంలపై పెద్దగా నమ్మకం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో తగిలిన షాక్‌తో… గత మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా బ్యాలెట్ పద్దితలోనే ప్రభుత్వం నిర్వహించింది. నాలుగు లోక్‌సభ సీట్లను గెల్చుకున్న బీజేపీకి ఆ ఎన్నికల్లో దానికి తగ్గట్లుగా ఫలితాలు రాలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు..మున్సిపల్ ఎన్నికలకు తేడా ఉంటుందని చెప్పుకున్నారు. ఇప్పుడు.. గ్రేటర్ ఎన్నికల్లోనూ బ్యాలెట్టే వాడుస్తున్నారు. వాస్తవానికి గత బల్దియా ఎన్నికల్లోనూ… ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు గ్రేటర్ పరిధిలో తిరుగులేని విజయాలొచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఈవీఎంలు వద్దనుకుంటోంది. బ్యాలెట్ ప్రకారం జరిగే ఎన్నికల్లో … కొన్ని చెల్లని ఓట్లు… వస్తాయి… ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతుంది..కానీ ఫలితంపై మాత్రం ఎవరికీ అనుమానాలుండవు. దీంతో చాలా మందికి బ్యాలెట్టే బెటరన్న అభిప్రాయం ఉంది. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్యాలెట్‌తోనే ఓటింగ్ జరగనుంది.
బ్యాలెట్‌ను టిఆర్ఎస్ ఆహ్వానించడం వెనుక మతలబు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకంగా ఉన్న విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు ఏలాగో ఓటింగ్‌కు వచ్చే అవకాశంలేదు. ఇక ఓటింగ్‌లో పాల్గొనేది సాధారణ జనం. వాళ్లు ఈవీఎంలతో కన్ప్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణ జనాన్ని ఓటింగ్‌కు ఏలాగో అలాగో రప్పించి టిఆర్ఎస్కు అనుకూలంగా ఓటింగ్ వేయించుకోవచ్చేనే వ్యూహంతోనే గ్రేటర్లో బ్యాలెట్‌ను టిఆర్ఎస్ ఆహ్వానించినట్లుగా భావిస్తున్నారు.
- రాజ్యలక్ష్మి డి
ఎంసిజె