SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

పాలకులు నియంతలైతే.....ఇలానే ఉంటుంది.

Updated: 2020-10-04 05:58:20

 
 
పాలకులు నియంతలైతే.....ఇలానే ఉంటుంది.
ప్రజాస్వామ్య దేశంలో పాలకులు ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కోసం పాటుపడాలి. కానీ ఆదునిక భారత ప్రజాస్వామ్యంలో పాలకులు నియంతలుగా మారిపోతున్నారు. ప్రజల్లో్ ప్రజ్వరిల్లే నిరసన రూపాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. పాలకుల చేతుల్లో పోలీసు యంత్రాంగం పావుగా మారిపోవడంతో ప్రజాస్వామ్యంలో  నిరసన రూపాలపై లాఠీ ఝుళిపిస్తున్నారు.  కర్కశంగా అణచివేస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండే పార్టీ కోసం రాజ్యంగ నిబంధనలకు గోరికట్టి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మహిళలు అన్న గౌరవం లేకుండా జుగుస్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రెండు మూడు రోజులుగా పోలీసు వ్యవస్థ వ్యవహరించిన తీరు చూస్తే అసలు భారత దేశం ప్రజాస్వామ్య దేశమా అనిపిస్తోంది. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా? అన్న అనుమానం కలిగిస్తోంది. యోగి ప్రభుత్వం నిరసనలను అడ్డుకోవడానికి ఇంతగా తెగించవలసిన అవసరం ఉందా? 
హాథ్రస్‌ హత్యచార సంఘటనకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అయింది. రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఘాటుగానే స్పందించిది. హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కలుసుకోవ డానికి ప్రయత్నించిన మాజీ ప్రధాని కూతురు, ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అక్షేపణీయం, ప్రియాంక పట్ల మగ పోలీసులు దురుసుగా వ్యవహరించారు. తాకరని చోట ప్రియాంకను తాకి ఇది నియంత పాలనకు ప్రతీక అని నిరూపించారు. ఓ మాజీ ప్రధాని మనుమరాలు, మాజీ ప్రధానికి కూతురు, ఆరేళ్ల క్రితం వరకు అధికారంలో  పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ కూతురైన ప్రియాంక పట్ల పోలీసులు ఇలాగా వ్యవహరిస్తే ఆ రాష్ట్రంలో సామాన్య మహిళల పట్ల పోలీసులు ఇంకా ఏలా వ్యవహరిస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం. ప్రియాంకను సమర్ధించినంత మాత్రానా కాంగ్రెస్‌ పార్టీని సమర్ధించినట్లు కాదు. ఒక మహిళ పట్ల అత్యంత జుగుస్సాకరంగా వ్యవహరించిన పోలీసుల పట్ల వ్యక్తమైన అభ్యంతరం. మరొక మహిళను అయితే పోలీసులు టాప్‌ లాగారు. మాజీ ప్రధానికి కూతురును ఈడ్చిపారేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రియాంకా కనబరచిని తెగువ అబ్బుర పురిచింది. కోట్లాది మంది మహిళ్లల్లో స్పూర్తి నింపింది. సెల్యూట్‌ ప్రియాంకా. 
-రాజ్యలక్ష్మి దొంతు
-ఎంసిజె