SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

2.5 కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లు చోరీ

Updated: 2020-09-22 19:43:56

రెండున్నర కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లు చోరీ 
చెన్నై నుంచి ఢిల్లీకి కంటైనర్ లో తరలిస్తుండగా అపహరణ
ఒకటి కాదు రెండు కాదు 2400 సెల్ ఫోన్లు...వీటి విలువ అక్షరాల రెండున్నర కోట్లు.
కంటైనర్ లో తరలిస్తుంటే...దొంగల ముఠా కన్నేసింది.పక్కా ప్లానుతో..పకడ్బందీగా ఎవరికి అనుమానం కొట్టేశారు.చైన్నై నుంచి ఢిల్లీకి కోట్ల రూపాయల విలువైన మొబైల్స్ ను తరలిస్తుంటే...ఎక్కడ కన్నేసిందో ఈ దొంగల ముఠా తెలియదు కానీ మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద దోచేశారు.సెల్ ఫోన్ల చోరీపై కంపెనీ ప్రతినిధులు చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.