SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో రైల్

Updated: 2019-09-22 14:18:29

Views: 152

విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యల కారణంగా అమీర్‌పేట్ సమీపంలో మెట్రో రైలు నిలిచిపోయింది. బేగంపేట్, అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్‌లో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దీంతో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై స్పందించిన మెట్రో అధికారులు.. సాంకేతిక సమస్య కారణంగా సింగిల్ లైన్ విధానంలో రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. ఫలితంగా మెట్రో రైలు ప్రయాణం కొంత ఆలస్యం అవుతోంది. సమస్య పరిష్కారానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.