మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

వెండితెర వీర ప్రేమగాథ

Updated:2016-12-28 12:24:53

views:111

‘ప్రేమమ్‌’లో ఒకటి..రెండు కాదు... ఏకంగా మూడు ప్రేమకథలు కనిపించాయి. ఆయా కథలకు తగ్గట్టు నాగచైతన్య తన లుక్‌ని మార్చుకొన్న విధానం యువతరాన్ని ఆకట్టుకొంది. మూడు ప్రేమకథల్లోనూ వైవిధ్యం కనిపించడం ప్రేక్షకులకు నచ్చింది. దాంతో చైతూ ఖాతాలో ఓ విజయం నమోదైంది.

ఈ ప్రేమకథలన్నీ సరికొత్తవి అని చెప్పడానికి వీల్లేదు. కొత్తగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కథని నడిపించిన విధానం, నాయకానాయికల కెమిస్ట్రీ, సంగీతం ఇవన్నీ చిత్ర విజయంలో కీలక పాత్రలు పోషించాయి. ప్రేమకథని చెప్పే ప్రయత్నంలో దర్శకులు సహజత్వానికి పెద్ద పీట వేయడం ఆకట్టుకొంటోంది. ‘‘నవతరం సినిమా అంటే ఇది వరకు ప్రేమకథే అనుకొనేవారు. ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. కొత్త జోనర్లలో సినిమాలు తీస్తున్నారు. దాంతో ప్రేమకథల జోరు తగ్గింది’’ అంటున్నారు సినీ విశ్లేషకులు.


సంబంధిత వార్తలు