Breaking
News
Breaking
News
Updated: 2016-12-28 12:22:12
Views: 486
తెలుగు తెరపై మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కి రంగం సిద్ధం అవుతోందా? వెంకటేష్, పూరి జగన్నాథ్ తొలిసారి కలసి పనిచేయబోతున్నారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. దర్శకుడు పూరి... వెంకీ కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆ కథని వెంకటేష్‌కి వినిపించారని సమాచారం. వెంకటేష్ కూడా ఎప్పటి నుంచో పూరితో కలసి పనిచేయాలని ఎదురుచూస్తున్నారు. పూరి చెప్పిన కథ నచ్చడంతో వెంకీ పచ్చజెండా వూపారని తెలుస్తోంది. వెంకటేష్ నటించిన ‘గురు’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తరవాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేష్ ఓ చిత్రంలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈలోగా పూరి లైన్లోకి వచ్చారు. మరి ఈ ఇద్దరిలో ఎవరి సినిమాకి ముందుగా పట్టాలెక్కిస్తారో తెలియాల్సివుంది.