Breaking
News
Breaking
News
Updated: 2016-12-27 12:38:16
ఇప్పటి వరకూ 4కే వీడియోలను స్మార్ట్ టీవీల్లోనే చూసుంటారు. ఇక మీదట స్మార్ట్ ఫోన్లోనూ చూడొచ్చు. ఎందుకంటే సోనీ కంపెనీ సరికొత్త మొబైల్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే తొలిసారి ముస్తాబయిన 4కే ఫోన్ ఇదే. పేరు Xperia Z5 Premium.4కే ఆల్ట్రా హెచ్డీ డిస్లేపేతో గ్రాఫిక్స్ కట్టిపడేస్తాయి. కేవలం చూడడమే కాదు. 23 మెగాపిక్సల్ కెమెరాతో 4కే వీడియోలను చిత్రీకరించొచ్చు. వీడియోల నుంచి 8 మెగాపిక్సల్ క్వాలిటీతో స్క్రీన్‌షాట్స్ తీసుకోవచ్చు. ఇక ‘ఫింగర్‌ప్రింట్ సెన్సర్’తో ఫోన్‌ని సురక్షితంగా వాడుకోవచ్చు. ఫోన్‌ని ఆన్‌లాక్ చేయాలంటే మీ వేలిముద్ర ఉండాల్సిందే. తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. రిజల్యూషన్ 3840X2160 పిక్సల్. Qualcomm Snapdragon 810 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్ 3జీబీ. ఇంటర్నల్ మెమొరీ 32 జీబీ. మైక్రోఎస్డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని 200 జీబీ వరకూ పెంచుకోవచ్చు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు ఫోన్‌ని వాడుకోవచ్చట. వాటర్‌ప్రూఫ్ రక్షణ ఉంది. ధర రూ.52,990. ఆన్లైన్ అంగడి ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/vxNbc5