Breaking
News
Breaking
News
Updated: 2016-12-27 12:13:03
మీ స్నేహితులంతా కలసి ఓ విహారయాత్రకు వెళ్దామనుకుంటున్నారా? ఆ వివరాలతో ఓ ఈవెంట్ పేజీ క్రియేట్ చేసి ఇన్విటేషన్ పంపిస్తే బాగుంటుంది కదూ. అందులో తేదీ, ప్రాంతం, ఎవరెవరు వెళ్దామనుకుంటున్నారనే విషయాలు నమోదు చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఇప్పటిదాకా ఫేస్బుక్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు గూగుల్ క్యాలెండర్‌లోనూ ఇలాంటి సదుపాయం వచ్చింది. దీని కోసం గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేసి దిగువన ఉన్న ప్లస్ గుర్తు ఒత్తండి. అక్కడ ఈవెంట్ అని ఉంటుంది. అందులో పూర్తి వివరాలు ఇచ్చిన ఇన్వైట్ బాక్స్‌లో మీరు ఎవరెవరికి ఆహ్వానం పంపాలనుకుంటున్నారో వారి మెయిల్ ఐడీలు ఇవ్వాల్సి ఉంటుంది.