మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

జనవరి 1 తర్వాత వారికి చుక్కలే

Updated:2016-12-26 12:09:52

views:114

దేశంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకే ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో భాజపా ఏర్పాటుచేసిన సుపరిపాలనా దినం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు... దేశంలో కాంగ్రెస్‌ వాసన, గాలి తగలకుండా ప్రధాని అయిన మొదటి వ్యక్తి వాజ్‌పేయి అని తెలిపారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు సజావుగా అందించడంతో ఆయన చూపిన చొరవ అందరికీ ఆదర్శనీయమన్నారు. దేశంలో ప్రతి ఇంటా టెలిఫోన్‌, ప్రతి గ్రామానికి రోడ్డు, అన్ని నగరాలు, పట్టణాలు, రాష్ట్రాలకు జాతీయ రహదారులు అనుసంధానం చేయడం, కొత్తరైళ్ల ప్రారంభం, విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ వాజ్‌పేయి హయాంలోనే వేగంగా జరిగాయన్నారు.


సంబంధిత వార్తలు