Breaking
News
Breaking
News
Updated: 2016-12-26 12:08:09
ఏపీ సాంఘికసంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జానీమూన్ మధ్య వివాదానికి ముగింపు పలికారు. ఆదివారం తెదేపా కార్యాలయంలో జానీమూన్, రావెలతో జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు సమావేశమై చర్చించారు. ఇరువురి మధ్య నెలకొన్న బేదాభిప్రాయాలు, సమస్యలపై ఒక నిర్ణయానికి వచ్చారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జానీమూన్, రావెల ముఖాముఖీ భేటీతో వివాదం సమసిందని మంత్రి ప్రత్తిపాటి ప్రకటించారు. సద్దుమణిగిన వివాదాన్ని సాగదీయటం సరికాదని మీడియా ప్రతినిధులను కోరారు. నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేస్తామని జానీమూన్, రావెల ప్రకటించారు.