Breaking
News
Breaking
News
Updated: 2016-12-23 12:20:14
అమెరికాలో సంపన్నులైన పారిశ్రామికవేత్తల జాబితానుప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. 40ఏళ్లలోపు వయసు కలిగిన సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లకు చోటు లభించింది. కాగా, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. బయోటెక్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి 24వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం సంపద విలువ 600 మిలియన్ డాలర్లు. ఇక అపూర్వ మెహతా 360 మిలియన్ డాలర్ల సంపదతో 31 స్థానాన్ని దక్కించుకున్నారు.హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యను అభ్యసించారు. బయోటెక్ రంగంలో కంపెనీని స్థాపించి వృద్ధి పథంలో దూసుకుపోతున్నారని ఫోర్బ్స్ తెలిపింది. ఈయన కంపెనీ 2016లో స్టాక్మార్కెట్లో ముందస్తు పబ్లిక్ ఆఫర్(ఐపీవో)కు వచ్చింది. దీని ద్వారా ఆయన 218 మిలియన్ డాలర్ల షేర్లను నాస్డాక్లో విక్రయించారు.