మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

సమయానికి తగిన‘టీ’

Updated:2016-12-16 16:14:33

views:258

రీరం ఏమాత్రం చురుగ్గా లేకుండా, మందకొడిగా ఉన్నప్పుడు అంటే శరీరంలో జీవక్రియల వేగం పడిపోయినప్పుడు గ్రీన్‌టీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.నిద్రలేక...ఆ ప్రభావం మరుసటి రోజు కూడా పడుతూ ఏ పనిచేయలేకపోతున్నప్పుడు చామంతిపూల టీని తాగాలంట.ఒత్తిడి వేధిస్తున్నప్పుడు నిమ్మ టీ తాగడం వల్ల మేలు జరుగుతుంది. ఒత్తిడి కలిగించే ఆలోచనలు తగ్గుతాయి. నిమ్మ పరిమళంలోని సుగుణాలు మనసుని సానుకూల ఆలోచనల దిశగా మళ్లిస్తాయి.కడుపులో తిప్పుతూ వికారంగా అనిపిస్తున్నప్పుడు మనకి ఏ పనీ చేయాలని అనిపించదు. అటువంటప్పుడు అల్లం టీ తాగితే తక్షణం ఉపశమిస్తుంది.కడుపు ఉబ్బరంగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుంటే... పుదీనా ఆకులతో చేసిన టీ పొట్టను తేలిక చేస్తుంది.


సంబంధిత వార్తలు