మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

పాకిస్థాన్‌ క్రికెటర్ల మధ్య వాగ్వాదం

Updated:2016-12-15 18:02:45

views:97

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు పాక్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ ఆడారు. ఈ క్రమంలో బౌలర్లు వాహబ్‌ రియాజ్‌, యాసిర్‌ షా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకోవడంతో పాటు పరస్పరం దూషించుకున్నారు. గమనించిన కోచ్‌ మిక్కి ఆర్ధర్‌ వెంటనే ఆటగాళ్లకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ‘ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం నిజమేనని.. ఇది ఏమంత సీరియస్‌గా తీసుకునే విషయం కాదని’ పాక్‌ జట్టు ప్రతినిధి అజ్మద్‌ హుస్సేన్‌ భట్టి తెలిపారు.రియాజ్‌, షాలు ఇప్పుడు బాగానే ఉన్నారని.. పరస్పరం క్షమాపణలు కూడా చెప్పుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘ఇద్దరం మంచి స్నేహితులం, మా మధ్య ఏం జరగలేదు, ఇద్దరం మ్యాచ్‌లో పాల్గొంటాం. మా కోసం ప్రార్థనలు చేయండి’ అంటూ రియాజ్‌, షాలు అభిమానులకు వీడియో సందేశం పంపారు.


సంబంధిత వార్తలు