మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

ట్రస్ట్‌ ఛైర్మన్‌ పదవికి రతన్‌టాటా గుడ్‌బై!

Updated:2016-12-16 15:50:22

views:155

ముంబయి: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ పదవి నుంచి రతన్‌ టాటా వైదొలగనున్నారు. టాటా సన్స్‌లో కీలకమైన 66శాతం వాటా కలిగిన ట్రస్ట్‌ ఛైర్మన్‌ పదవికి రతన్‌టాటా గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని టాటాలకు చెందిన ఆంతరంగిక వ్యవహారాలు చూసే ఆర్‌కే కృష్ణకుమార్‌ స్పష్టంచేశారు. తదుపరి ఛైర్మన్‌ పదవికి సంబంధించి అప్పుడే చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి బయటి సలహాదారుల నుంచి సూచనలను ఆహ్వానించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది మధ్య నాటికి కొత్త ఛైర్మన్‌ ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. అయితే ట్రస్ట్‌ కొత్త ఛైర్మన్‌ తప్పనిసరిగా భారతీయుడే అయి ఉంటారని, కానీ టాటా కుటుంబానికి లేదా పార్శీ సమాజానికి చెందినవారే కావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.


సంబంధిత వార్తలు