Breaking
News
Breaking
News
Updated: 2016-12-22 10:43:11
విజయ్ దివస్ సందర్భంగా దేశ రక్షణకోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాధిపతులు నివాళులర్పించారు. దిల్లీలోని అమర్‌జవాన్ జ్యోతి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి సైనికులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దేశ సైన్యానికి వందనాలు, భారతీయ మిలిటరీ విజయాల్లో విజయ్ దివస్(1971, భారత్-పాక్ యుద్ధం) ముఖ్యమైనదని పేర్కొంటూ సైన్యం గొప్పదనాన్ని పారికర్ కొనియాడారు. ఈ సందర్భంగా పారికర్ మాట్లాడుతూ తదుపరి ఆర్మీ చీఫ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది.