SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

ఐఎఎస్ అధికారిణి అంటూ 11కోట్లకో టోకరా

Updated: 2021-02-24 05:12:53

జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీకోసం ఓ మహిళ ముగ్గురి సహయంతో ఓ వ్యక్తిని బ్లాక్ మేయిల్ చేసి దాదాపు 11కోట్ల వరకు వసూలు చేసిన సంఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది...
 
 బాచుపల్లి పియస్ లో CI Narsimha Reddy ఆద్వర్యంలో మాదాపూర్ DCP Venkateshwarlu ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విలాసాలకు అలవాటు పడిన ఓ సాధారణ మహిళ స్మృతి సింహ తాను "ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ చైర్మెన్ సౌత్ ఇండియా" అని పరిచయం చేసుకుంటూ డబ్బు ఉన్న వారిని లక్ష్యం చేస్తూ మోసాలకు పాల్పడేది...ఈమె తన ముగ్గురు అనుచరులు రాఘవరెడ్డి, రనధీర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డిలతో కలిసి  బాచుపల్లి పరిధిలో నివాసం ఉండే వీరా రెడ్డి(36) అనే వ్యాపారి నుంచి 11 కోట్ల వరకు బ్లాక్ మేయిల్ చేసి బయపెట్టి వసూలు చేసింది. వీరి బ్లాక్ మేయిల్ కి విసిగివేసారిన వీరారెడ్డి  బాచుపల్లి పియస్ లో ఈనెల 12న స్మృతి సింహ పై ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు నింధితులపై నిఘాపెట్టి నేడు స్మృతి సింహ, ఆమెకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులు రాఘవ రెడ్డి, రనధీర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి లను అరెస్ట్ చేసి డిమాండ్ కు తరలించారు...వీరి వద్ద నుండి సుమారు ఆరు కోట్ల మేర ఆస్తులు స్వాధీనం చేసుకున్నామని అందులో 50 లక్షలు విలువ చేసే బంగారు/ వెండి నగలు, 7మొబైల్ ఫోన్స్ , 2లక్షల నగదు, క్రెడిట్ /డెబిట్ కార్డులు, ఖరీదైన 5కార్లు( 3 BMW, 2Ford Cars) , విల్లాను స్వాధీన చేసుకున్నామని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీకోసం డబ్బు ఉన్న వారిని టార్గెట్ చేయడం వీరి లక్ష్యం అని, వీరి గ్యాంగ్ లో ఉండే మరో వ్యక్తి అంకిరెడ్డి విజయకుమార్ రెడ్డి తాను IPS కు సెలెక్ట్ అయ్యాయని చెప్పుకొని బ్లాక్ మేయిల్ చేస్తుంటాడని, ప్రస్తుతానికి ఇతను ఫరారీలో ఉన్నాడని DCP వెంకటేశ్వర్లు తెలిపారు. డబ్బున్న వారిని బయపెట్టి డబ్బు, బంగారం, ఆస్తీ, కార్లను దోచుకోవడం వీరి పని అని ప్రజలు ఇలాంటి వారి వద్ద మోసపోవద్దని తెలిపారు. ఎవరైనా ఇలాంటి వ్యక్తులు తారస పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.