డైలాగ్స్ ,డ్యాన్స్ ,సిక్స్ ఈజీ గా కొట్టొచ్చు కానీ రైతు పంట పండిచేది ఈజీ కాదు....? జగ్గారెడ్డి
కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటను కార్పొరేట్ వ్యవస్థ ద్వారా నిర్బంధించి, భారత దేశంలో ఉన్న రైతును ఆర్ధికంగా నడ్డి విరిగేలా చట్టాలు తీసుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వానికి గత రెండు నెలలుగా చల్లని చలి లో దుమ్ముధూళి ,రాత్రి ,పగలు వయసుకు తేడా లేకుండా 10 ఏళ్ల నుండి వందేళ్ల వయసు కలవారు పిల్లలు,యువతి యువకులు,వల్ల తల్లితండ్రులు మొత్తం ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారు.
రైతులు పండించిన పంటని మనం తింటు మన జీవితాన్ని అనుభవిస్తూ ఆ రైతు ఉద్యమాలు చేస్తుంటే దానికి దేశంలో ఉన్న ఒక బీజేపీ, టీఆరెస్ తప్పిచి కాంగ్రెస్ పార్టీ తోపాటు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ లు రైతులకు, రైతు ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నాయి.
ఆ రైతులు పండించిన పంటను తింటూ ఆ రైతుల పోరాటాన్ని వ్యతిరేకిస్తున్న కొంతమంది ఫిల్మ్ మరియు క్రికెట్ సెలబ్రిటీ లు మూర్ఖంగా మాట్లాడడం బాధాకరం..
మొహానికి రంగులు వేసుకొని సినిమాలో పనిచేయడం, ఒక క్రికెటర్ బ్యాట్ పట్టుకొని అడటము రైతు భూమి మీద నాగలు పెట్టి దున్నినంత సులువు కాదు..
మీ సినీ పరిశ్రమల్లో కానీ, క్రికెట్ లో కానీ మీకు బ్రేక్ లు,కూల్ డ్రింక్స్ ,టీ లు ,స్నాక్స్ ఇంటర్వెల్ లు, ఉంటాయి.. మీరు ఆడుతుంటే ,పడుతుంటే చప్పట్లు తో ప్రోత్సాహం ఉంటుంది. కానీ భూమి మీద నాగలి పట్టి దున్ని పంటలు పండించే రైతుకు ఇలాంటి సదుపాయాలు ఉండవు..
అలాంటి రైతులని మీ లాంటి కొందరు సెలెబ్రెటీ లు విమర్శించడమా..! ఒక పరాయి దేశస్థులు ఎవరైతే రైతులకు మద్దతు ఇచ్చారో ఆ సెలెబ్రెటీ ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన మీరు (మీరు అంటే కొందరు సెలెబ్రెటీ లు) మద్దతు ఇవ్వకపోగా, విమర్శలు చేస్తారా, మీకు సిగ్గు అనిపించడం లేదా..!
ఒకసారి సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, యాక్టర్లు కంగనా అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ మీరందరు ఒక్కసారి నాగలి పట్టి భూమి దున్ని ఇత్తులేసి, నీరు పోసి పంట పండించగలరా ?
నాగలి పట్టి, పొలం దున్ని పంట పండించడం అంటే క్రికెట్ ఆడినంత ఈసీ కాదు.. సినీ పరిశ్రమలో డైలాగ్, డాన్స్ చేసినంత సులువు కాదు.
మీలాంటి కొందరు సినిమా సెలెబ్రెటీ లు రైతుల కష్టాల మీద రైతు పండించిన పంటకు మద్దతు ధర లేకనో, అకాల వర్షాలకో , నకలి విత్తనాలకో, ఎరువులకో పంట నష్టపోయిన దాని మీద అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతుల మీద మీలాంటి ఎంతో మంది సినీ సెలబ్రిటీ లు ఈ కథనాల మీద సినిమాలు తీసి ఆ రైతు పేరు మీద సొమ్ము చేసుకోవడం లేదా..!ఇది నిజమే కదా...
మీరు చేసే మీ వృత్తిలో ఎన్ని కోట్లు సంపాదించిన చివరకు ఆ రైతు పండించిన పంటను తినే కదా మీరు బ్రతికేది..ఈ మాత్రం జ్ఞ్యానం కూడా మీకు లేదా..! ఇంకా రైతుల పట్ల పిచ్చి కామెంట్లు చేయకండి చేస్తే చరిత్ర లో మీరు మూర్ఖులుగా నిలిచిపోతారు..