SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

కాశీలో కల్వకుంట్ల కుటుంబం పూజలు

Updated: 2021-01-28 11:42:55

కాశీలో కల్వకుంట్ల కుటుంబం పూజలు
కేసీఆర్‌ కుటుంబం కాశీ యాత్ర అందుకేనా? 
కేటీఆర్‌ సీఎం అయితే విఘ్నాలు కలుగకుండా ఉండేదుకేనా?
కేటీఆర్‌ సీఎం అవుతారని టిఆర్‌ఎస్‌ వర్గాల్లో విస్త్రతృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కల్వకుంట్ల కుటుంబం ఆకస్మాత్తుగా కాశీ యాత్రకు బయలుదేరింది.  నేడు రేపు వారణాసిలో పర్యటించనున్న సీఎం సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  కుటుంబ సభ్యులు పర్యటించనున్నారు.  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తోపాటు  సీఎం కేసీఆర్  సతీమణి, శ్రీమతి శోభ,నేడు రేపు ఉత్తర ప్రదేశ్ లోని‌ వారణాసిలో పర్యటించనున్నారు. తొలిరోజు అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేస్తారు.  దశాశ్వమేధ ఘాట్ లో గంగా ఆర్తి, గంగా పూజ చేస్తారు.  ఆ తరువాత అస్సి ఘాట్ కు బోట్లో‌ తిరుగు‌ ప్రయాణం అవుతారు.  సంకత్మోచన్ దేవాలయ దర్శనం, ప్రత్యేక పూజలు, పట్టు వస్త్రాల‌ సమర్పిస్తారు. ఇదంతా త్వరలో కేటీఆర్‌ సీఎం కాబోతున్న నేపథ్యంలో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్‌ సీఎం అయితే ఏలాంటి విఘ్నాలు కలుగకుండా ఉండేందుకే ఈ పూజలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.