SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

రెడ్డి' ఓట్లను చీల్చడానికే తెరపైకి షర్మిల కొత్త పార్టీ

Updated: 2021-01-24 12:18:08

రెడ్డి' ఓట్లను చీల్చడానికే తెరపైకి షర్మిల కొత్త పార్టీ
రేవంత్‌ వైపు చూస్తున్న రెడ్డి వర్గం డైవర్ట్‌ స్కీం
అంతా కేసీఆర్ స్కెచ్‌ 
కేసీఆర్‌ వ్యూహంతోనే జగన్‌ అడుగులు
తెలంగాణలో బిజెపి సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టిఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ కొత్త వ్యవూహానికి పదును పెట్టాడు. తెలంగాణలో ముఖాముఖి పోరు ట్రైయాంగిల్‌ ఫైట్‌ చేసి తద్వార లబ్దిపొందాలని చూస్తోంది టిఆర్ఎస్‌.  తెలంగాణలో కాంగ్రెస్‌ను కోలుకోకుండా చంపిన పాపం టిఆర్ఎస్‌ను వెంటాడింది. అవసరం లేకపోయినా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం, కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచినా ఆ పార్టీ నుంచి టిఆర్ఎస్‌లో లాక్కోవడంతో ప్రజలు ప్రత్యమ్నాయాన్ని వెతికారు.  ఈనేపథ్యంలో కేసీఆర్‌ వ్యతిరేక శక్తులకు బిజెపి ప్రత్యమ్నాయంగా దొరికింది. టిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పోరాడే శక్తి లేదని, కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసినా, అ పార్టీ అభ్యర్దులను గెలిపించినా అది టిఆర్ఎస్‌కు ఓటువేసినట్లేనని భావించిన ఓటర్లు బిజెపి వైపు మొగ్గు చూపారు. ఫలితంగానే దుబ్బాకలో బిజెపి గెలుపు, హైదరాబాద్‌ ఎన్నికల్లో బిజెపికి అనూహ్య విజయం లభించింది. దీంతో కంగారుపడిన కేసీఆర్‌ తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయ శక్తిగా ఎదుగుతున్న బిజెపిని నిలువరించడానికి, అలాగే రేవంత్‌ రూపంలో ముంచుకొస్తున్న పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి జగనన్న బాణమైన షర్మిలను తెలంగాణలో వదలడానికి జగన్‌తో ఒప్పందం చేసుకున్నాడు. షర్మిలను తెలంగాణ బరిలోకి దించడం ద్వార రెండు రకాల ప్రయోజనాలను కేసీఆర్‌ ఆశిస్తున్నారు. ఒకటి తెలంగాణలో ట్రైయాంగిల్ ఫైల్ చేయడం, రెండవది రేవంత్‌కు పీసీసీ ఇచ్చినా, కొత్త పార్టీ పెట్టిన తెలంగాణలో ప్రభావిత శక్తులైన రెడ్డి వర్గాన్ని చీల్చడం ద్వారా ప్రయోజనం పొందం. ఈ రెండు రకాల ప్రయోజనాలను ఆశించిన కేసీఆర్‌, జగన్‌తో మంతనాలు జరిపి ఏదో ఒక రూపంలో షర్మిలను తెలంగాణపై లాంచ్‌ చేయబోతున్నారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనతో లభించిన ఇమేజితో గట్టెక్కిన కేసీఆర్‌కు 2018 ఎన్నికల్లో తొలుత ఒక నినాదం అంటూ లేదు. చేసిన అభివృద్ది అంతంత మాత్రమే. చేసిన వాగ్ధానాలు నెరవేర్చలేని స్థితిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయి కాంగ్రెస్‌ వైపు ప్రజలు అంతా మొగ్గుచూపారు. అప్పడు కూడా కాంగ్రెస్‌లో ఉన్న కోవర్ట్‌లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో జతకట్టించి చంద్రబాబును బూచి చూపి టిఆర్‌ఎస్‌ విజయం ఖాయం చేసుకున్నాడు. ఇప్పడు కూడా అదేరకమైన వ్యూహంతో షర్మిలను లాంచ్‌ చేయాలని చూస్తున్నాడు కేసీఆర్‌.  షర్మిల తెలంగాణలో అడుగుపెట్టడం ద్వారా టిఆర్‌ఎస్‌కు లభించే ప్రయోజాలను ఒకసారి చూస్తే.. కేసీఆర్ మీద కోపంతో ఉన్న క్రైస్తవులు బీజేపీకీ కాంగ్రెస్‌కు వెయ్యలేని వారు... షర్మిల వైపు వస్తారు. తద్వారా కాంగ్రెస్‌ ఓట్లకు దారుణంగా గండిపడుతుంది. జగన్ డైరెక్ట్ తెలంగాణాలో జెండా ఊపితే బీజేపీ తొక్కేస్తుంది. కాబట్టి చెల్లికి తనకు విభేదాలున్నాయనే ప్రచారం చేస్తే అది కూడా బలంగా జరిగితే బీజేపీని కూడా ఇరుకున పెట్టొచ్చ అనే వ్యూహానికి జగన్‌ పదునుపెట్టాడు.  కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు రేవంత్‌కు వచ్చినా లేదా సొంత పార్టీ పెట్టుకున్నా  తెలంగాణలో దుమ్ము రేపుద్ది. రేవంత్‌ చంద్రబాబుకు అనుకూలం కాబట్టి... జగన్‌ని తిడతాడు కాబట్టి కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ అభిమానులు షర్మిల వైపు వెళ్తారనేది మరో వ్యూహం.  తెలంగాణాలో క్రైస్తవ మత ప్రచారం పెరిగితే కేసీఆర్‌కు చాలా లాభం... అందుకే బ్రదర్ అనీల్‌ తెలంగాణాలో ఫోకస్‌ చేసినా సైలెంట్‌గా ఉన్నారు..షర్మిల పార్టీ పెడితే క్రైస్తవ ఓటు బ్యాంకు 70 శాతం షర్మిల వైపే రావడం ఖాయం.  జగన్ డైరెక్ట్‌గా రావడం కంటే షర్మిలను దించితేనే కేసీఆర్‌కు లాభం.. ఇవన్నీ లెక్కలు వేసుకుని తెలంగాణలో మరో కొత్త డ్రామాకు టిఆర్‌ఎస్‌-వైసీపీ నేతలు తెరలేపారు.