SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

చిరుతపులిని చంపి కూర వండుకు తిన్న వేటగాళ్లు

Updated: 2021-01-23 11:28:26

చిరుతపులిని చంపి కూర వండుకు తిన్న వేటగాళ్లు 
కేరళలోని ఇడుక్కి అటవీప్రాంతంలో కొ్ంత మంది ప్ర‌బుద్దులు చిరుత పులిని చంపేసి అక్క‌డే కూర వండుకుని తినేశారు. ఈ ఘాతుకానికి పాల్ప‌డిన అంద‌ర‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఇంకా మిగిలిన పులికూర , చిరుత పులి చర్మం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అట‌వీలో సంచ‌రిస్తున్న చిరును ఉచ్చుల‌తో బంధించిన ప్ర‌బుద్దులు, ఆ చిరుత‌ను దారుణంగా చంపి తోలు ,గోళ్లు తీసి ఆత‌రువాత చిరుత‌ను వండుకుని తిన్నారు. కేరళలో  చిరుతపులి  మాంసం తిన‌డం ఇదే మొద‌టిద‌ని పోలీసులు చెబుతున్న‌ప్ప‌టికీ గ‌తంలో కూడా పోలీసుల‌కు దొర‌కుండా ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కేర‌ళ‌లోని మంకులం కు చెందిన కొల్లికోలవిల్ వినోద్ పికె (45), బాసిల్ గార్డెన్ విపి కురియాకోస్ (74), చెంపెన్‌పురైదతిల్ సిఎస్ బిను (50), మలాయిల్ సాలి కుంజప్పన్ (54), వడక్కుంచలిల్ విన్సెంట్ (50) అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. అడ‌విలొ దొరికిన అన్ని జంతువుల‌ను ర‌చిచూచినా తృప్తి తీర‌లేద‌ని అందుకే చిరుత పులి మాంసం ఏలా ఉంటుందో ర‌చి చూద్దామ‌ని చిరుత‌ను చంపి తిన్న‌ట్లు నిందితులు అంగీక‌రించారు.