SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

కేటీఆర్‌ సీఎం అయితే

Updated: 2021-01-22 08:09:34

కేటీఆర్‌ సీఎం అయితే   కేసీఆర్‌ కేబినెట్‌ రద్దు
కొత్త కేబినెట్ ఏర్పాటు చేసుకోనున్న కేటిఆర్‌.
త్వరలోనే కేటీఆర్‌ సీఎం అవుతాడు, కొత్త కేబినెట్‌ ఏర్పాటు చేసుకుంటాడు.
 
త్వరలో కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌కు తెలంగాణ సీఎంగా పట్టాబిషేకం జరుగతోంది. ఇప్పటికిప్పడు ముహూర్తం అయితే ఖరారు కాలేదుగానీ ఈ ఏడాది కేటీఆర్‌ సీఎం కావడం ఖాయమైపోయింది. ఎప్పటి నుంచో కేటీఆర్‌ను ఊరిస్తున్న సీఎం పదవి ఎట్టకేలకు ఈ ఏడాది దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మార్చిలోగానే తెలంగాణ సీఎంగా కల్వకుంట్ల తారక రామారావు ప్రమాణాస్వీకారం చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మరావు క్లిస్టర్‌ క్లియర్‌గా కేటీఆర్‌ సీఎం త్వరలోనే అవుతాడని చెప్పాడు. అది ఎప్పడు అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. కేటీఆర్‌ సీఎం కాగానే నిబంధనల ప్రకారం కేసీఆర్‌ కేబినెట్‌లో ఉన్న మంత్రులంతా రాజీనామా చేస్తారని, కొత్తగా కేటీఆర్‌ తన టీమ్‌ ఏర్పాటు చేసుకుంటారని కూడా పద్మరావు చెప్పారు. 
కేటీఆర్‌ సీఎం కాగానే ఆయన కేబినెట్‌ ఎవరు ఉంటారు. కేసీఆర్‌ కేబినెట్‌ లో ఉన్న వాళ్లలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి? ఎవరికి ఊడిపోతాయనే ఊహగానాలు ఊపందుకుంటున్నాయి. 
కేటీఆర్‌ టీమ్‌లో ఉండేవాళ్లు ఎవరు? కేసీఆర్‌ టీమ్‌లో ఉండి మంత్రి పదవులు ఊసిపోయేవాళ్లు ఎవరు? అనేది ఇప్పడు జోరుగా చర్చ కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు గ్యారెంటీగా పదవి దక్కుతుందనే ఆశతో ఉన్నారు. అయితే హైదరాబాద్‌లో ఎవరని పీకి పద్మరావుకు ఇస్తారంటే తలసాని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సో కేసీఆర్‌ టీమ్‌లోని తలసానికి పదవి గండం ఉంది. హోంమంత్రి   మహమూద్‌ అలీ  స్థానంలో నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన షకీల్‌ను కేటీఆర్‌ టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. కరీంనగర్‌ ఉమ్మడి  జిల్లాలో కొప్పుల ఈశ్వర్‌కు ప్రత్యమ్నాయంగా ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకటవీరయ్యకు పదవి దక్కొచ్చనేది కేటీఆర్‌ వర్గాలు చెబుతున్నాయి. గంగుల కమాలకర్‌కు బదులుగా వరంగల్‌కు చెందిన  దాస్యం వినయ్‌ బాస్కర్‌కు మంత్రి పదవి దక్కే అవకాశ ఉంది.  ఆదిలాబాద్‌లో ఇంద్రకరణ్‌ను కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోనేరు కొనప్పకు పదవి దక్కవచ్చని భావిస్తున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో సత్యవతి రాథోడ్‌కు లేదా ఎర్రబెల్లి దయాకర్‌రావుకు  చెక్‌ పెట్టి ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన రేఖానాయక్‌ను భర్తీ చేస్తారంటున్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాకు చెందిన జగదీశ్వర్‌రెడ్డికి స్థానంలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నారు. కౌన్సిల్‌ చైర్మన్‌ పదవి జగదీశ్వర్‌రెడ్డికి అప్పగించే అవకాశ ఉంది. మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్‌, నిరంజన్‌రెడ్డిలను యథావిదిగా కొనసాగిస్తారని కేటీఆర్‌ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ సీఎంగా తప్పుకుంటున్న నేపథ్యంలో కల్వకుంట కుటుంబం నుంచి కేసీఆర్‌ కూతురు కవితకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. రంగారెడ్డిలో సబిత స్థానం పదిలంగానే ఉంటుందని అంటున్నారు. కేటీఆర్‌ కేబినెట్‌లో భారీ మార్పలు తధ్యమంటున్నారు కేటీఆర్‌ సన్నిహితులు