నల్గొండ జిల్లాలో ఘోరం.. 10మంది కూలీలు మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మంది మృత్యువాత పడ్డారు.8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. రెక్కడితే గాని డొక్కాడని దినసరి కూలీలు రక్తపు మడుగులో ఉండటం అందరినీ కలిచివేసింది.