SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

నల్గొండ జిల్లాలో ఘోరం.

Updated: 2021-01-21 08:00:53

నల్గొండ జిల్లాలో ఘోరం.. 10మంది కూలీలు మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో  10మంది మృత్యువాత పడ్డారు.8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. రెక్కడితే గాని డొక్కాడని దినసరి కూలీలు రక్తపు మడుగులో ఉండటం అందరినీ కలిచివేసింది.